| కీర్తనలు | త్యాగరాజు | నిధిచాల సుఖమో రాముని స |
| కల్యాణి - త్రిపుట ( - చాపు) |
| పల్లవి: |
| నిధిచాల సుఖమో రాముని స న్నిధిసేవ సుఖమో నిజముగఁ బల్కు మనస ॥ని॥ |
| అను పల్లవి: |
| దధి నవనీత క్షీరములు రుచో దాశ రథీ ధ్యానభజన సుధారసము రుచో ॥ని॥ |
| చరణము(లు): |
| శమ దమ మను గంగాస్నానము సుఖమో క ర్దమ దుర్విషయ కూపస్నానము సుఖమో మమత బంధవయుత నరస్తుతి సుఖమో సుమతి త్యాగ రాజనుతుని కీర్తన సుఖమో ॥ని॥ |