| కీర్తనలు | త్యాగరాజు | నిను వినా నా మది యెందు నిలువదే శ్రీహరి హరి |
| నవరస కన్నడ - రూపకం |
| పల్లవి: |
| నిను వినా నా మది యెందు నిలువదే శ్రీహరిహరి ॥నిను॥ |
| అను పల్లవి: |
| కనులకు నీ సొగసెంతో గ్రమ్మి యున్నది గనుక ॥నిను॥ |
| చరణము(లు): |
| నీదు కథలు వీనులందు నిండియున్నవి రామ శ్రీద నీ నామము నోటఁ జెలగి యున్నది గనుక ॥నిను॥ |
| నేను యెచటఁ జూచినను నీవైయున్నది రామ భానువంశ తిలక నీదు భక్తుఁ డనుచు పేరు గనుక ॥నిను॥ |
| కపటమౌ మాట లెల్ల కమ్మనైనది నా తపము యొక్క ఫలము నీవే త్యాగరాజ సన్నుత ॥నిను॥ |