| కీర్తనలు | త్యాగరాజు | నిన్ను బాసి యెట్ల యుందురో? నిర్మలాత్ములౌ జనులు |
| బలహంస - ఆది |
| పల్లవి: |
| నిన్ను బాసి యెట్ల యుందురో? నిర్మలాత్ములౌ జనులు ॥నిను॥ |
| అను పల్లవి: |
| అనఘ! సుపుణ్య అమర వరేణ్య! సనక శరణ్య! సత్కారుణ్య! ॥నిను॥ |
| చరణము(లు): |
| కనులకు చలువ, చెవుల కమృతము విను రసనకు రుచి, మనసుకు సుఖము తనువుకు యానందమును గల్గఁజేయు త్యాగరాజ హృద్ధామ! పూర్ణకామ! ॥నిను॥ |