| కీర్తనలు | త్యాగరాజు | నిన్నే నెరనమ్మినానురా ఓరామ! రామయ్య |
| పంతువరాళి - రూపకం |
| పల్లవి: |
| నిన్నే నెరనమ్మినానురా ఓరామ! రామయ్య ॥నిన్నే॥ |
| అను పల్లవి: |
| అన్ని కల్లలనుచు నాడి పాడి వేడి పన్నగశయన నే చిన్నతనము నాడె ॥నిన్నే॥ |
| చరణము(లు): |
| వేద శాస్త్ర పురాణ విద్యలచే భేద వాదములు దీరక భ్రమయు వారల జూచి ॥నిన్నే॥ |
| భోగముల కొఱకు భువిలో రాసమ్మున యాగాదు లొనరించి వలయు వారల జూచి ॥నిన్నే॥ |
| ఈ జన్మమున నిన్ను రాజిఁ జేసికొన లేక రాజిల్లని త్యాగరాజ రాజ రాఘవ ॥నిన్నే॥ |