| కీర్తనలు | త్యాగరాజు | నిరవధి సుఖద నిర్మలరూప నిర్జితమునిశాప |
| రవిచంద్రిక - ఆది |
| పల్లవి: |
| నిరవధి సుఖద నిర్మలరూప నిర్జితమునిశాప ॥ని॥ |
| అను పల్లవి: |
| శరధిబంధన నతసంక్రందన శంకరాది గీయమాన సాధుమానస సుసదన ॥ని॥ |
| చరణము(లు): |
| మామవ మరకత మణినిభ దేహ శ్రీరమణీలోల శ్రితజనపాల భీమ పరాక్రమ భీమ కరార్చిత తామస రాజస మానవదూర త్యాగరాజ వినుత చరణ ॥ని॥ |