| కీర్తనలు | త్యాగరాజు | నీ దయ గల్గుటే భాగ్యమని - నిజముగ నేల దోచదో? |
| రీతిగౌళ - ఆది |
| పల్లవి: |
| నీ దయ గల్గుటే భాగ్యమని - నిజముగ నేల దోచదో? ॥నీ దయ॥ |
| అను పల్లవి: |
| నాద రూప! నీరద సన్నిభ! దిన నాథాన్వయభూషణ! మృదు భాషణ! ॥నీ దయ॥ |
| చరణము(లు): |
| అవివేకులైన దార తనయుల - నను దినమును గలిసి భవ సాగరమున నీదలేక - భయమున జెయ్యలసి యవనీశుల గాచి సుఖము - లేక ఆయాసము సొలసి వివిధములగు నీ మాయ లోపలఁ దగిలిన తనకీ యవధులను దెలిసి ॥నీ దయ॥ |
| వేగి లేచి తా నతి లోభి జనుల - వెంబడిగఁ దిరిగి రోగియై తా కోరిన కోర్కెలు - రోయక మేను కరఁగి భోగ భాగ్యముల కొర కన్యసురుల - భూసురుల గోరి తిరిగి యే గతియు లేక యీ సుఖంబు లిట్లని తన మదిని తా నెఱిఁగి ॥నీ దయ॥ |
| నాగ నాయక శయనేందు దిన నాథ నయన సీతాంక యోగి వందిత పదారవింద యుగ శరణా కళంక రాగ లోభ మదాదుల గొట్టి రక్షించెడు బిరుదాంక త్యాగరాజ పూజిత రఘునాయక తారకమని తెలియు నిశ్శంక ॥నీ దయ॥ |