| కీర్తనలు | త్యాగరాజు | నీ నామరూపములకు - నిత్య జయమంగళం |
| సౌరాష్ట్రము - ఆది |
| నీ నామరూపములకు - నిత్య జయమంగళం ॥నీ॥ |
| పవమానసుతుఁడు బట్టు - పాదార విందములకు ॥నీ॥ |
| పంకజాక్షి నెలకొన్న - యంకయుగమునకు ॥నీ॥ |
| నలినారిగేరు చిరు - నవ్వుగల మోమునకు ॥నీ॥ |
| నవముక్తాహారములు - నటియించు యురమునకు ॥నీ॥ |
| ప్రహ్లాద నారదాది - భక్తులు పొగడుచుండు ॥నీ॥ |
| రాజీవనయన త్యాగ - రాజ వినుతమైన ॥నీ॥ |