| కీర్తనలు | త్యాగరాజు | నీవంటి దైవమును షడానన |
| తోడి - ఆది |
| పల్లవి: |
| నీవంటి దైవమును షడానన నేనెందు కానరా నీ.. |
| అను పల్లవి: |
| భావించి చూడఁ దరముగాని బ్రహ్మపురి నిలయ గిరిజాతనయ నీ.. |
| చరణము(లు): |
| సరిబాలురతోఁ గైలాసగిరిని శుభాకృతితోఁ నాడఁగను వెఱపులేక ప్రణవార్థము తానను విధిని కోపగించి సరగున నవవీరులందొక కిం కరుని గని ముమ్మారు సెలవిచ్చి సురలు మురపురారులు విని మెచ్చగ వరుసగాను సృష్టిశక్తి నొసఁగిన నీ.. |
| హరిహరాదులకు దిక్పాలుల కల శశిసూర్యులకు మఱి విద్యాధరులకు బ్రహ్మాండములను వెలసే వరవీరాదులకుఁ దరముగాక నిన్ను జతగూడుక శరణముగా విని సైరించక పరమద్రోహియైన శూర పద్మా సురుని కీర్తిగాను గర్వమణచిన నీ.. |
| మారకోటులందుఁ గల్గిన శృం గారమెల్ల ఇందుముఖ నీ కొన గోరును బోలునె యటువంటి శుభా కారము సంతతము సారెకు నామదిని నిల్పిన కు మార దయావర నీరజలోచన తారకాథిప కలాధరుఁడగు శ్రీ త్యాగరాజ సన్నుతాశ్రితహిత నీ.. |