| కీర్తనలు | త్యాగరాజు | నీవేరా కులధనము సంతతము నీవేరా జీవనము |
| బేగడ - చాపు |
| పల్లవి: |
| నీవేరా కులధనము సంతతము నీవేరా జీవనము నీ.. |
| అను పల్లవి: |
| ఈ వఱకును తెలియకున్న నేరము దేవర క్షమచేసి దయతో నేలుకోరా నీ.. |
| చరణము(లు): |
| మాధవ సీతానుజ వరసహిత మంగళకర పరమార్థభూతచరిత గాధియాగ సంరక్షక సతత గతిజాప్త నతజనావృత విధివినుత నీ.. |
| సుజననిచయపాపహిమచండసూర్య సుస్వరజిత ఘనరవమాధుర్య అజముఖారి సమర నిరుపమశౌర్య ఆనంద కంద సుందర సువర్య నీ.. |
| రాఘవ సర్వోన్నత సుప్రకాశ రమణీయకర పాటితలంకేశ త్యాగరాజవర హృదయనివేశ తరణి శశాంకలోచన జానకీశ నీ.. |