| బేహాగ్ - ఆది |
| పల్లవి: |
| నే నెందు వెతుకుదురా హరి ॥నే॥ |
| అను పల్లవి: |
ఆనాల్గు మోములవాని మొఱ
నాలకించి రాని నిన్ను ॥నే॥ |
| చరణము(లు): |
కలుషాత్ముఁడై దుష్కర్మయుతుఁడై
పలుమారు దుర్భాషియై
ఇలలో భక్తాగ్రేస
రులవేషియై త్యాగరాజ పూజిత ॥నే॥ |
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - nee neMdu vetukuduraa hari ( telugu andhra )