| పూరీ కల్యాణి - దేశాది |
| పల్లవి: |
| పరలోక సాధనమే మనసా ప.. |
| అను పల్లవి: |
స్మరలోభమోహాది పాపులను
స్మరియించకే శ్రీరామ భజన ప.. |
| చరణము(లు): |
జననాది రోగభయాదులచే
జగమందుఁ గల్గు దురాసలచేఁ
దనయాది బాంధవుల భ్రమచేఁ
దగల నీదు త్యాగరాజనుతుని భజన ప.. |
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - paralooka saadhanamee manasaa ( telugu andhra )