| కీర్తనలు | త్యాగరాజు | పలుకవేమి నా దైవమా |
| పూర్ణచంద్రిక - ఆది |
| పల్లవి: |
| పలుకవేమి నా దైవమా పరులు నవ్వేది న్యాయమా ॥ప॥ |
| అను పల్లవి: |
| అలుగఁ గారణమేమిరా రామ నీ వాడించినట్లు యాడిన నాతో ॥ప॥ |
| చరణము(లు): |
| తల్లిదండ్రి భక్తినొసంగి రక్షించిరి తక్కినవార లెంతో హింసించిరి దెలిసి యూరకుండేది యెన్నాళ్లురా దేవాదిదేవ త్యాగరాజునితో ॥ప॥ |