| కీర్తనలు | త్యాగరాజు | పాలింతువో పాలింపవో? బాగైనఁ బల్కుఁ బల్కి నను |
| కాంతామణి - దేశాది |
| పల్లవి: |
| పాలింతువో పాలింపవో? బాగైనఁ బల్కుఁ బల్కి నను ॥పాలింతువో॥ |
| అను పల్లవి: |
| ఏలాగు నిన్నాడుకొన్న నేర మెంచఁ బనిలేదు నాదుపైని ॥పాలింతువో॥ |
| చరణము(లు): |
| పరమార్థమగు నిజమార్గమును వరదేశికుం డానతీయగ పరిపూర్ణమౌ భక్తి మార్గమే యని భావించిన త్యాగరాజుని ॥పాలింతువో॥ |