| కీర్తనలు | త్యాగరాజు | పాహి కల్యాణ సుందరరామ మాం పాహి కల్యాణ సుందర రామ |
| పున్నాగవరాళి - చాపు |
| పల్లవి: |
| పాహి కల్యాణ సుందర రామ మాం పాహి కల్యాణ సుందర రామ మాం ॥పాహి॥ |
| చరణము(లు): |
| చదివిన వాఁడనుగాను రామ ఇది బుద్ధియనుచు తెలియలేను ॥పాహి॥ |
| భజియించుటకు బుద్ధిలేక రామ బతిమాలి తిరిగితి యిందాక ॥పాహి॥ |
| దినదిన ముదరముకొఱకై రామ ధనికుల గాచితిని యీవరకు ॥పాహి॥ |
| ఆలు సుతులపైని ప్రేమ నీ ప దాల నుంచనైతి రామ ॥పాహి॥ |
| సంసార సుఖము సత్యమని నామ సార మెఱుఁగ మరిచితిని ॥పాహి॥ |
| విషయసుఖాదుల రోయలేక విర్రవీగి మోసమాయె ॥పాహి॥ |
| శుకసన్నుత నన్ను కన్నతండ్రి యొకసారి శరణనుకొంటి ॥పాహి॥ |
| తమ్మికన్నుల రఘువీర నిను నమ్మిన నన్నేలుకోరా ॥పాహి॥ |
| నేరమెంతో జేసినాను యేమి నేరమనుచు వేడినాను ॥పాహి॥ |
| నిను నమ్మువారిదే మేలు నీపాదసేవ వెయివేలు ॥పాహి॥ |
| సాకేత రామ నామీద దయ లేకుండుటకు మరియాద ॥పాహి॥ |
| శరణ్య కోసలరాజ రామ పరిపాలిత త్యాగరాజ ॥పాహి॥ |