| కాపి - ఝంప |
| పల్లవి: |
| పాహి మాం శ్రీరామచంద్ర, పాహి మాం శ్రీరామ ॥పాహి॥ |
| చరణము(లు): |
| అక్కరతో పాదములకు మ్రొక్కితి యేల పరాకు ॥పాహి॥ |
| దిక్కునీవైయుండగాను గ్రక్కున వేడు కొన్నను ॥పాహి॥ |
| మక్కువతో రామ నీవు ఎక్కువజేసి నన్ను బ్రోవు ॥పాహి॥ |
| చక్కని నీ ముద్దు మోము ఒక్కసారి కనుపింపుము ॥పాహి॥ |
| అన్నిటనే నెలకొన్న నిన్ను మించిన వారెవరన్న ॥పాహి॥ |
| చిన్ననాడే యనుసరించి కొన్నవాఁడని నను పాలించు ॥పాహి॥ |
| పన్నగ భూషణుఁడ చాల నిన్ను కొనియాడు నీవేళ ॥పాహి॥ |
| మన్నగ జేసి యేలవయ్యా పన్న రక్షక రామయ్య ॥పాహి॥ |
| పన్నుగ శ్రీ త్యాగరాజ సన్నుత భాస్కర తేజ ॥పాహి॥ |