| కీర్తనలు | త్యాగరాజు | పూలపాన్పుమీద బాగ పూర్ణ పవ్వళించు |
| ఆహిరి - త్రిశ్రలఘు |
| పల్లవి: |
| పూలపాన్పుమీద బాగ పూర్ణ పవ్వళించు ॥పూ॥ |
| అను పల్లవి: |
| నీలఘనశ్యామహరే నిరుపమ రామయ్య మల్లె ॥పూ॥ |
| చరణము(లు): |
| మధుశర్కర యానబాలు మఱి యారగించి విధుముఖ కమ్మని విడెమువేసి ననుఁ గటాక్షించి ॥పూ॥ |
| పరిమళగంధంబు మేన బాగుగాను బూసి మెఱయఁగ సుమహారములను మెడనిండను వేసి ॥పూ॥ |
| ఆగమోక్త మైనశయ్య నంగీకరించి త్యాగరాజ కృతములెల్ల తథ్యమని సంతోషించి ॥పూ॥ |