| కీర్తనలు | త్యాగరాజు | ప్రక్కల నిలఁబడి గొలిచెడి ముచ్చట బాగ దెల్పరాదా |
| ఖరహరప్రియ - త్రిపుట |
| పల్లవి: |
| ప్రక్కల నిలఁబడి గొలిచెడి ముచ్చట బాగ దెల్పరాదా ॥ప॥ |
| అను పల్లవి: |
| చుక్కల రాయని గేరు మోముఁగల సుదతి సీతమ్మ సౌమిత్రి రాముని కిరు ॥ప॥ |
| చరణము(లు): |
| తనువుచే వందన మొనరించుచున్నారా చనవున నామకీర్తన సేయుచున్నారా మనసున దలిచి మైమరచియున్నారా నెనరుంచి త్యాగరాజునితో హరిహరి వీరిరు ॥ప॥ |