| కీర్తనలు | త్యాగరాజు | బడలిక దీర పవ్వళించవే |
| రీతిగౌళ - ఆది |
| పల్లవి: |
| బడలిక దీర పవ్వళించవే ॥బడలిక॥ |
| అను పల్లవి: |
| సడలని దురితములను తెగకోసి సార్వభౌమ సాకేతరామ ॥బడలిక॥ |
| చరణము(లు): |
| పంకజాసనుని పరితాపము కని పంకజాప్తకుల పతివై వెలసి పంకజాక్షితో వనమున కేగి జింకను వధియించిన ॥బడలిక॥ |
| మంకురావణుని మదము నణచి ని శ్శంకుఁడగు విభీషణునికి బంగారు లంక నొసగి సురుల బ్రోచిన నిష్క ళంక త్యాగరాజనుత రామ ॥బడలిక॥ |