| కీర్తనలు | త్యాగరాజు | బాలే బాలేందు భూషణి భవరోగ శమని |
| రీతిగౌళ - ఆది |
| పల్లవి: |
| బాలే బాలేందు భూషణి భవరోగ శమని ॥బాలే॥ |
| అను పల్లవి: |
| ఫాలలోచని! శ్రీ ధర్మసంవర్ధని సకల లోక జనని ॥బాలే॥ |
| చరణము(లు): |
| శీలె నను రక్షింపను జా గేలె పరమపావని సుగుణ జాలె నతజన పరిపాలన లోలె కనకమయ సు చేలె కాలవైరికి ప్రియమైన యి ల్లాలవై యిందు వెలసినందుకు శ్రీలలితె నీ తనయుఁడని నను కు శాలుగా బిలువ వలెనమ్మ ॥బాలె॥ |
| సారె సకల నిగమ వన సం చారె చపలకోటి నిభ శ రీరె దేవతాంగన పరి వారె పామర జన దూరె కీరవాణి శ్రీపంచనదపుర వి హారివై వెలసినందు కిక నా నార కోటులనెల్ల సహించి గారవింపవలెనమ్మ శివె ॥బాలె॥ |
| రామె ప్రణయార్తిహరాభి రామె దేవకామిని ల లామె త్యాగరాజ భజన స కామె దుర్జనగణ భీమె నా మనసున నీ చరణముల సదా నేమముతో పూజజేసితిని శ్రీ రామసోదరివై వెలసిన శ్రీ శ్యామలె ధర్మ సంవర్ధని ॥బాలె॥ |