| కీర్తనలు | త్యాగరాజు | బ్రోచే రారెవరే రఘుపతీ |
| శ్రీరంజని - ఆది (దివ్యనామము) |
| పల్లవి: |
| బ్రోచే వారెవరే రఘుపతీ ॥బ్రో॥ |
| నిను వినా ॥బ్రో॥ |
| శ్రీరామా నెనరునఁ ॥బ్రో॥ |
| సకల లోకనాయక ॥బ్రో॥ |
| నరవర నీ సరి ॥బ్రో॥ |
| దేవేంద్రాదులు మెచ్చుటకు లంక దయతో దానమొసంగి సదా ॥బ్రో॥ |
| మునిసవంబుఁ జూడ వెంటఁ జని ఖల మారీచాదుల హతంబుజేసి ॥బ్రో॥ |
| వాలి నొక్కకోలనేసి రవి బా లుని రాజుఁగ గావించి జూచి ॥బ్రో॥ |
| భవాబ్ధి తరణోపాయము నేరని త్యాగరాజుని కరంబిడి ॥బ్రో॥ |