| కీర్తనలు | త్యాగరాజు | భజరామం సతతం మానస |
| హుసేని - ఆది (దివ్యనామము) |
| భజరామం సతతం మానస ॥భ॥ |
| అమిత శుభాకరం పాప - తిమిర విభాకరం ॥భ॥ |
| శతముఖనుతగీతం సకలా - శ్రితపారిజాతం ॥భ॥ |
| పాలితలోకగణం పరమ క - పాలి వినుత సుగుణం ॥భ॥ |
| సరోజ వరనాభం యమపు - రారాతి లాభం ॥భ॥ |
| వరానందకందం నత - సురాది మునిబృందం ॥భ॥ |
| కమనీయశరీరం ధీరం - మమ జీవాధారం ॥భ॥ |
| కరధృతశరచాపం రామం - భరితగుణకలాపం ॥భ॥ |
| భవ జలనిధి పోతం సారస - భవముఖ నిజతాతం ॥భ॥ |
| వాతాత్మజసులభంవర - సీతావల్లభం ॥భ॥ |
| రాజరవినేత్రం త్యాగ - రాజవరమిత్రం ॥భ॥ |