| కీర్తనలు | త్యాగరాజు | భజరే భజ, మానస రామం |
| కన్నడ - చాపు |
| పల్లవి: |
| భజరే భజ, మానస! రామం ॥భజరే॥ |
| అను పల్లవి: |
| అజముఖ శుక వినుతం శుభ చరితం ॥భజరే॥ |
| చరణము(లు): |
| నిర్మితలోకం నిర్జిత శోకం పాలిత మునిజన మధునా నృప పాకం ॥భజరే॥ |
| శంకర మిత్రం శ్యామల గాత్రం కింకర జన గణతాపత్రయ తమోమిత్రం ॥భజరే॥ |
| భూసమ శాంతం భూజా కాంతం వార మభిలదం త్యాగరాజ హృద్భాంతం ॥భజరే॥ |