| కీర్తనలు | త్యాగరాజు | భవనుత నా హృదయమున రమింపుము బడలికదీఱ |
| మోహన - ఆది |
| పల్లవి: |
| భవనుత నా హృదయమున రమింపుము బడలికదీఱ భ.. |
| అను పల్లవి: |
| భవతారక నాతో బహుబల్కిన బడలికదీఱ కమల సం భ.. |
| చరణము(లు): |
| పవనసుతప్రియ తనకై తిరిగిన బడలిక దీఱ భవనముఁజేరి నన్ను వెఱపించిన బడలికదీఱ కమల సం భ.. |
| వరమగు నైవేద్యములను సేయని బడలికదీఱ పరవలేక సరిపోయినట్టాడిన బడలికదీఱ కమల సం భ.. |
| ప్రబలఁజేసి ననుఁ బ్రోచేననుకొన్న బడలికదీఱ ప్రభు నీవు త్యాగరాజునికి బడలికదీఱ కమల సం భ.. |