| శ్రీరంజని - దేశాది |
| పల్లవి: |
భువిని దాసుఁడనే పేరాసచే
బొంకులాడితినా బుధమనోహర ॥భు॥ |
| అను పల్లవి: |
అవివేక మానవులఁ గోరికోరి
అడ్డద్రోవ త్రొక్కితినా బ్రోవవే ॥భు॥ |
| చరణము(లు): |
చాల సౌఖ్యమో కష్టమో నేను
జాలిజెందితినా సరివారిలో
పాలముంచిన నీటముంచిన
పదములేగతి త్యాగరాజనుత ॥భు॥ |
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - bhuvini daasu.rDanee peeraasachee ( telugu andhra )