| నళినకాంతి - దేశాది |
| పల్లవి: |
మనవాలకించరాదటే
మర్మమెల్లఁ దెల్పెదనే మనసా మ.. |
| అను పల్లవి: |
ఘనుఁడైన రామచంద్రుని
కరుణాంతరంగముఁ దెలిసిన నా మ.. |
| చరణము(లు): |
కర్మకాండమతాకృష్టులై భవ
గహనచారులై గాసిఁ జెందగ
కని మానవావతారుఁడై
కనిపించినాఁడే నడత త్యాగరాజు మ.. |
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - manavaalakiMcharaadaTee ( telugu andhra )