| కీర్తనలు | త్యాగరాజు | మనసు విషయ నట విటుల కొసంగిన |
| నాటకురంజి - ఆది |
| పల్లవి: |
| మనసు విషయ నట విటుల కొసంగిన మా రాముని కృప గలుగునో? మనసా! ॥మనసు॥ |
| అను పల్లవి: |
| తన తలు పొకరింటికిఁ దీసిపెట్టి తాఁ గుక్కలఁ దోలురీతి గాదో! ॥మనసు॥ |
| చరణము(లు): |
| తవిటికి రంకాడఁబోయి కూటి తవిల కోతి గొంపోయినటు గాదో? ॥మనసు॥ |
| చెవిటికి నుపదేశించినటు గాదో? శ్రీ త్యాగరాజ నుతుని దలచక ॥మనసు॥ |