| కీర్తనలు | త్యాగరాజు | మనసు స్వాధీనమైన యా ఘనునికి |
| శంకరాభరణము - రూపకము |
| పల్లవి: |
| మనసు స్వాధీనమైన యా ఘనునికి మఱి మంత్రతంత్రము లేల ॥మ॥ |
| అను పల్లవి: |
| తనువు తానుగాదని యెంచువానికి తపసు చేయనేల దశరథబాల ॥మ॥ |
| చరణము(లు): |
| అన్ని నీవనుచు యెంచినవానికి యాశ్రమ భేదములేల కన్నుగట్టు మాయలని యెంచువానికి కాంతల భ్రమలేల దశరథబాల ॥మ॥ |
| ఆజన్మము దుర్విషయ రహితునికి గ తాగత మికనేల రాజరాజేశ నిరంజన నిరుపమ రాజవదన త్యాగరాజ వినుత ॥మ॥ |