| కీర్తనలు | త్యాగరాజు | మనసునిల్ప శక్తిలేకపోతే |
| ఆభోగి - ఆది |
| పల్లవి: |
| మనసునిల్ప శక్తిలేకపోతే మధురఘంటవిరుల పూజేమి జేయును? మ.. |
| అను పల్లవి: |
| ఘనదుర్మదుఁడై తా మునిగితే కావేరి మందాకిని యెటు బ్రోచును? మ.. |
| చరణము(లు): |
| సోమిదమ్మ సొగసుగాండ్రఁ గోరితే సోమయాజి స్వర్గార్హుఁడౌనో? కామక్రోధుఁడు తపంబొనర్చితే గాచి రక్షించునో? త్యాగరాజనుత! మ.. |