| హిందోళము - ఆది |
| పల్లవి: |
మనసులోని మర్మమును దెలుసుకో
మానరక్షక మరకతాంగ నా ॥మ॥ |
| అను పల్లవి: |
| ఇనకులాప్త నీవేగాని వేఱెవరులేరు ఆనందహృదయ ॥మ॥ |
| చరణము(లు): |
మునుపు ప్రేమగల దొరవై సదా
చనువు నేలినది గొప్పకాదయా
కనికరమ్ముతో నీవేళ నా
కరముఁబట్టు త్యాగరాజ వినుత ॥మ॥ |
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - manasulooni marmamunu delusukoo ( telugu andhra )