| కేదారం - ఆది |
| పల్లవి: |
| మరచెడు వాడనా? రామ నిను మదన జనక ॥మరచెడు॥ |
| అను పల్లవి: |
| మరకతాంగ నీయొక్క మది నెంచవలదు ॥మరచెడు॥ |
| చరణము(లు): |
కాని మానవులు గరుణ లేక నాపై
లేని నేరము లెంచిన గాని
శ్రీ నిజముగ నీ చెంత జేరిన గాని
రాని నీ దయ త్యాగరాజనుత ॥మరచెడు॥ |
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - maracheDu vaaDanaa? raama ninu madana janaka ( telugu andhra )