| కీర్తనలు | త్యాగరాజు | మఱి మఱి నిన్నే మొఱలిడ నీ |
| కాంభోజి - ఆది |
| పల్లవి: |
| మఱి మఱి నిన్నే మొఱలిడ నీ మనసున దయరాదు మ.. |
| అను పల్లవి: |
| కరిమొఱవిని సరగున చనఁ నీకు గారణమేమి సర్వాంతర్యామి మ.. |
| చరణము(లు): |
| కరుణతో ధ్రువుని కెదుట నిల్చిన కథ విన్నానయ్యా సురరిపుతనయునికై నరమృగమౌ సూచనలేమయ్యా మఱచియున్న వనచరునిఁ బ్రోచిన మహిమఁ దెలుపవయ్యా ధరను వెలయు త్యాగరాజ సన్నుత తరముగాదిక నే విననయ్యా మ.. |