| జయంతశ్రీ - దేశాది |
| పల్లవి: |
| మఱుగేలరా ఓ రాఘవ ॥మ॥ |
| అను పల్లవి: |
మఱుగేల చరాచర రూప! పరా
త్పర! సూర్య సుధాకరలోచన! ॥మ॥ |
| చరణము(లు): |
అన్ని నీవనుచు అంతరంగమున
తిన్నగా వెతకి తెలిసికొంటినయ్య
నిన్నెగాని మది నెన్నఁ జాల నొరుల
నన్నుఁ బ్రోవవయ్య త్యాగరాజనుత ॥మ॥ |
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - maRugeelaraa oo raaghava ( telugu andhra )