| కీర్తనలు | త్యాగరాజు | మా పాల వెలసి యిక |
| అసావేరి - ఆది |
| పల్లవి: |
| మా పాల వెలసి యిక మముఁ బ్రోవఁగరాదా శ్రీరామచంద్ర మా.. |
| అను పల్లవి: |
| నీ పాదముల భక్తి నిండారగ నిచ్చి కాపాడుశక్తి నీ కరమున నుండఁగ మా.. |
| చరణము(లు): |
| పాపసంహార నా పరితాపములను దునుమ నేపాటిరా కరుణాపయోనిధివైన శ్రీపతీ విధృత చాపబాణ యీ పాపమతి నరులాపదలను నే నేపని జూతును ఆపద్బాంధవ కాపాడ నీకీ పరాకేల మా.. |
| దీనరక్షక భక్తాధీన సాకేతనగరీశ నామది పద రిన సుజన మానాభిమానపాలన సమానరహిత రో సాన నీదు దాసానుదాసుఁడను దానవాంతక ము దాన నారద సుగానలోల దరిగాన సంతతము మా.. |
| నాగాధిపవినుత నాగారిరథ నినువినా గతి నెఱుఁగ నాగరాజ హృత్సాగరాబ్జ భవసాగరాంతకా సు రాఘహర కనకాగధీర సురనాగగమన శర ణాగతాప్త శ్రీ త్యాగరాజనుత మా.. |