| కీర్తనలు | త్యాగరాజు | మా రామచంద్రునికి జయమంగళం |
| కేదారగౌల - ఆది |
| మా రామచంద్రునికి జయమంగళం ॥మా॥ |
| ఘోరభవవరనిధి తారకునికి మంగళం ॥మా॥ |
| మారునిగన్న రాజ కు - మారునికి మంగళం |
| మారులేని హరికి ము - మ్మారు జయమంగళం ॥మా॥ |
| బాహులే యాప్తునికి సు - బాహువైరికి మంగళం |
| బాహుజాశూరుని కాజాను - బాహునికి మంగళం ॥మా॥ |
| బృందావనస్థిరమౌని - బృందావనునికి మంగళం |
| బృందాలోలునికి పాలిత - బృందారకునికి మంగళం ॥మా॥ |
| రాజవేషునికి రాజ - రాజార్చితునికి మంగళం |
| రాజధరుడగు త్యాగ - రాజ నుతునికి మంగళం ॥మా॥ |