| సురటి - చాపు |
| మాకులమున కిహ పర మొసగిన |
| నీకు మంగళం శుభమంగళం ॥మా॥ |
| మౌనుల బ్రోచిన మదజనక |
| నీకు మంగళం శుభమంగళం ॥మా॥ |
| మదగజగమన మానితసద్గుణ |
| నీకు మంగళం శుభమంగళం ॥మా॥ |
| మదమోహరహిత మంజుళరూపధర |
| నీకు మంగళం శుభమంగళం ॥మా॥ |
| మనసిజవైరి మానససదన |
| నీకు మంగళం శుభమంగళం ॥మా॥ |
| మనవిని విని మమ్మేలుకొన్న |
| నీకు మంగళం శుభమంగళం ॥మా॥ |
| మా మనసున నెలకొన్న రామ |
| నీకు మంగళం శుభమంగళం ॥మా॥ |
| మా మనోహర పాలిత త్యాగరాజ |
| మంగళం శుభమంగళం ॥మా॥ |
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - maakulamuna kiha para mosagina niiku maMgaLaM shubhamaMgaLaM ( telugu andhra )