| కీర్తనలు | త్యాగరాజు | మాటి మాటికి దెల్పవలెనా ముని మానసార్చిత చరణ |
| మోహన - చాపు |
| పల్లవి: |
| మాటి మాటికిఁ దెల్పవలెనా? ముని మానసార్చిత చరణా! రామయ్య నీతో! ॥మాటి॥ |
| అను పల్లవి: |
| సూటికొక్క టేమాట జాలదా? నాటి మొదలుకొని సాటిలేని నీతో ॥మాటి॥ |
| చరణము(లు): |
| పంకజ సదనా సరస వినోదా సంకటముల వేగమె దీర్పదారా? శంకరప్రియ సర్వాంతర్యామివి గాదా? యింక నా మది నీకు తెలియగ లేదా? ॥మాటి॥ |
| కరుణాసాగర పరిపూర్ణ! నీకు సరివేల్పులు లేరనుచు నీవరకు మొఱఁ బెట్టిన నాపై యేల పరాకు పరులు జూతురు భాండమున కొక్క మెతుకు ॥మాటి॥ |
| శృంగార శేఖర! సురవైరి రాజ భంగ! సుజన హృత్కుమద రాజ మంగళ కర రూప! జిత రతి రాజ గంగా జనక! పాలిత త్యాగరాజ ॥మాటి॥ |