| కీర్తనలు | త్యాగరాజు | మామవ సతతం, రఘునాథ! |
| జగన్మోహిని - ఆది |
| పల్లవి: |
| మామవ సతతం, రఘునాథ! ॥మా॥ |
| అను పల్లవి: |
| శ్రీద! దినాన్వయ సాగరచంద్రా! శ్రితజన శుభఫలద! సుగుణసాంద్ర! ॥మా॥ |
| చరణము(లు): |
| భక్తి రహిత శాస్త్రవిదతిదూర! పంకజదళనయన! నృపకుమార! ॥మా॥ |
| శక్తితనయ హృదాలయ! రఘువీర! శాంత! నిర్వికార! ॥మా॥ |
| యుక్తవచన! కనకాచలధీర! యురగశయన! మునిజన పరివార! త్యక్తకామమోహమదగంభీర! త్యాగరాజరిపు జలద సమీర! ॥మా॥ |