| కీర్తనలు | త్యాగరాజు | మామవ! రఘురామ, మరకత మణిశ్యామ |
| సారంగ - రూపకం |
| పల్లవి: |
| మామవ! రఘురామ! మరకత మణిశ్యామ! ॥మామవ॥ |
| అను పల్లవి: |
| పామరజన భీమ! పాలిత సుత్రామ! ॥మామవ॥ |
| చరణము(లు): |
| దురితంబులు బోదు ధునుమ మనసు రాదు ॥మామవ॥ |
| కలశాంబుధి లోన కరుణ కరగి బోయెనా ॥మామవ॥ |
| విను మఱి సమరము నా విధి శరము విరిగినా ॥మామవ॥ |
| గల సత్యము సుగుణ కాననమున నిల్చెనా ॥మామవ॥ |
| దివ్య నరాపఘ్న దేవత్వము బోయెనా ॥మామవ॥ |
| రాజాధిప త్యాగ రాజ వినుత బాగ ॥మామవ॥ |