| కీర్తనలు | త్యాగరాజు | ముందువెనుక ఇరుప్రక్కలతోడై |
| దర్బారు - ఆది |
| పల్లవి: |
| ముందువెనుక ఇరుప్రక్కలతోడై మురఖరహర రారా ముం.. |
| అను పల్లవి: |
| ఎందుఁగాన నీయందమువలె రఘు నందన వేగమే రారా ముం.. |
| చరణము(లు): |
| చండభాస్కర కులాబ్ధిచంద్ర కో దండపాణియై రారా అండఁగొలుచు సౌమిత్రి సహితుడై అమిత పరాక్రమ రారా ఓ గజరక్షక ఓ రాజకుమార ఓంకారసదన రారా భాగవతప్రియ బాగ బ్రోవవయ్య త్యాగరాజనుత రారా ముం.. |