| కీర్తనలు | త్యాగరాజు | ముద్దుమోము యేలాగు చెలంగెనో? మునులెట్లు గని మోహించిరో? |
| సూర్యకాంతము - ఆది |
| పల్లవి: |
| ముద్దుమోము యేలాగు చెలంగెనో? మునులెట్లు గని మోహించిరో? ॥ముద్దు॥ |
| అను పల్లవి: |
| కద్దనుచును చిరకాలము హృదయము కరఁగి కరఁగి నిల్చు వారికెదుట రాముని ॥ముద్దు॥ |
| చరణము(లు): |
| మనసు నిర్మలమగు భూసుర కృతమౌ మంచి పూజా ఫలమౌ, తొలుతటి తపమౌ ఘననిభ దేహుని జనన స్వభావమౌ ధనపతి సఖుఁడైన త్యాగరాజార్చితుని ॥ముద్దు॥ |