| మారువధన్యాసి - దేశాది |
| పల్లవి: |
| మృదుభాషణా నతవిభీషణా మృ.. |
| అను పల్లవి: |
సుదురాస మాన్పగలేని నను
సుఖచిత్తుగా నెవరు సేతురే మృ.. |
| చరణము(లు): |
వరదా నవాంబుద సమీరణ
వరదానఘామర పాలక
దరహాస సద్గుణభూష పరాత్
పర త్యాగరాజ కరార్చిత మృ.. |
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - mR^idubhaashhaNaa natavibhiishhaNaa ( telugu andhra )