| కీర్తనలు | త్యాగరాజు | మేలుకో దయానిధీ మేలుకో దాశరథీ |
| సౌరాష్ట్రము - రూపకము |
| పల్లవి: |
| మేలుకో దయానిధీ మేలుకో దాశరథీ ॥మే॥ |
| అను పల్లవి: |
| మేలుకో దయానిధీ మిత్రోదయమౌ వేళ ॥మే॥ |
| చరణము(లు): |
| నారదాదిమునులు సురలు వారిజభవుఁ డిందుకలా ధారుఁడు నీ సన్నిధినే కోరి కొలువుగాచినారు ॥మే॥ |
| వెన్నపాలు బంగారు గిన్నెల నేనుంచినాను తిన్నగారగించి తేటకన్నులతో నన్నుఁజూడ ॥మే॥ |
| రాజరాజాది దిగ్రాజులెల్ల వచ్చినారు రాజనీతితెలియ త్యాగరాజ వినుత నన్నుఁ బ్రోవ ॥మే॥ |