| కీర్తనలు | త్యాగరాజు | మేలుకోవయ్య మమ్మేలుకోవయ్య రామ |
| బౌళి - జంప |
| పల్లవి: |
| మేలుకోవయ్య మమ్మేలుకోవయ్య రామ ॥మే॥ |
| అను పల్లవి: |
| మేలైన సీతాసమేత నా భాగ్యమా ॥మే॥ |
| చరణము(లు): |
| నారదాదులు నిన్నుఁ గోరి నీ మహిమల న వారిగాఁ బాడుచున్నారిపుడు తెల్ల వారగా వచ్చినది శ్రీరామ నవనీత క్షీరములు బాగుగా నారగింపను వేగ ॥మే॥ |
| ఫణిశయన యనిమిష రమణు లూడిగముసేయ అణుకువగ నిండారు ప్రణుతి జేసెదరును మణిమయాభరణులౌ యణిమాదు లిడుదీప మణులు తెలుపాయెను తరణివంశవరతిలక ॥మే॥ |
| రాజరాజేశ్వర భరాజముఖ సాకేత రాజ సద్గుణ త్యాగరాజనుతచరణ రాజన్య విబుధగణరాజాదులెల్ల నిను పూజింపఁగాచినారీజగము పాలింప ॥మే॥ |