| కీర్తనలు | త్యాగరాజు | మోసబోకు వినవే సత్సహ - వాసము విడువకే |
| గౌళిపంతు - ఆది |
| పల్లవి: |
| మోసబోకు వినవే సత్సహ - వాసము విడువకే ॥మో॥ |
| అను పల్లవి: |
| దాస జనార్తి హరుని, శ్రీరాముని, వాసవ హృదయ నివాసుని, తెలియక ॥మో॥ |
| చరణము(లు): |
| అల్పాశ్రయమున గల్గు వెసనములు కల్పాంతరమైన బోదు; శేష తల్ప శయనుని నెఱనమ్మిన సం కల్ప మెల్ల నీడేరును, మనసా! ॥మో॥ |
| ధన తరుణుల కాశించునదెల్ల వెనక తనువు కలసటే గాని మనసు చేత సేవ్యుని దలచిన సు మనసత్వము నొసగునే, మనసా! ॥మో॥ |
| గౌరవ హీన ధనికులఁ గాచుటయు నేరములకెడ మౌను గాని, గౌరవించు త్యాగరాజ హృదయా గారుని, లోకాధారునిఁ, దలచక ॥మో॥ |