| కీర్తనలు | త్యాగరాజు | మోహనరామ ముఖజిత సోమ ముద్దుగఁ బల్కుమా |
| మోహన - ఆది |
| పల్లవి: |
| మోహనరామ ముఖజిత సోమ ముద్దుగఁ బల్కుమా ॥మో॥ |
| అను పల్లవి: |
| మోహనరామ మొదటి దైవమా మోహము నీపై మొనసియున్నదిరా ॥మో॥ |
| చరణము(లు): |
| ధర మనుజావతార మహిమ విని సురకిన్నర కింపురుష విద్యాధర సురపతి విధి విభాకర చంద్రాదులు కరఁగుఁచుఁ బ్రేమతో వర మృగ పక్షి వానర తనువులచే గిరిని వెలయు సీతావర చిరకాలము గుఱితప్పక మైమఱచి సేవించిరి వర త్యాగరాజ వరదాఖిల జగన్ ॥మో॥ |