| కీర్తనలు | త్యాగరాజు | యజ్ఞాదులు సుఖమను వారికి సమ మజ్ఞానులు గలరా |
| జయమనోహరి - ఆది |
| పల్లవి: |
| యజ్ఞాదులు సుఖమను వారికి సమ మజ్ఞానులు గలరా? ఓమనసా ॥యజ్ఞాదులు॥ |
| అను పల్లవి: |
| సుజ్ఞాన దరిద్ర పరంపరల సురచిత్తులు జీవాత్మ హింసగల ॥యజ్ఞాదులు॥ |
| చరణము(లు): |
| బహు జన్మంబుల వాసన యుతులై అహి విష సమ విషయాకృష్టులై బహిరాననులై త్యాగరాజు భజియించు శ్రీరామునికిఁ దెలియక ॥యజ్ఞాదులు॥ |