| కీర్తనలు | త్యాగరాజు | యోచనా కమల - లోచన ననుఁబ్రోవ |
| దర్బారు - ఆది |
| పల్లవి: |
| యోచనా కమల - లోచన ననుఁబ్రోవ ॥యో॥ |
| అను పల్లవి: |
| సూచనతెలియక నొరుల - యాచనఁజేతుఁననుచు నీకు తోచిన ద్యుతి విజితాయుత వి - మోచన నన్నుఁ బ్రోవనింక ॥యో॥ |
| చరణము(లు): |
| కేచన నిజభక్త నిచయ పావని - మోచనఁగల బిరుదెల్లఁగొని న న్నేచనాకృతవిపినచరావరాభి -షేచనా త్యాగరాజ పూజిత ॥యో॥ |