| కీర్తనలు | త్యాగరాజు | రక్ష బెట్టరె దొరకు లక్ష బెట్టరె |
| భైరవి - ఆది |
| పల్లవి: |
| రక్ష బెట్టరె దొరకు లక్ష బెట్టరె ॥ర॥ |
| అను పల్లవి: |
| వక్షస్థలమున వెలయు లక్ష్మీరమణునికి సాయ ॥ర॥ |
| చరణము(లు): |
| సీతాకరమునుబట్టి చెలఁగిన దొరకు వాతాత్మజునికి చెయి వశమైనదొరకు - పురు హూతాదుల రక్షింప బాహుజుడైన దొరకు - సం గీతాప్రియ త్యాగరాజ గేయుఁడైన దొరకైశ్వర్య ॥ర॥ |