| భైరవి - ఆది |
| పల్లవి: |
| రక్షబెట్టరే దొరకు రక్ష.. |
| అను పల్లవి: |
| వక్షస్థలమున వెలయు లక్ష్మీరమణునికి జయ రక్ష.. |
| చరణము(లు): |
సీతాకరమునుబట్టి చెలగిన దొరకు
వాతాత్మజునికి చేయి వశమైన దొరకు, పురు
హూతాదుల రక్షింప బాహుదుడైన దొరకు, సం
గీతప్రియ త్యాగరాజ గేయుడైన దొరకైశ్వర్య రక్ష.. |
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - raxabeTTaree doraku ( telugu andhra )