| కీర్తనలు | త్యాగరాజు | రఘునాయక! నీ పాదయుగ రాజీవముల నే విడజాల |
| హంసధ్వని - దేశాది |
| పల్లవి: |
| రఘునాయక! నీ పాదయుగ రాజీవముల నే విడజాల శ్రీ ॥రఘు॥ |
| అను పల్లవి: |
| అఘజాలములఁబారఁదోలి న న్నాదరింప నీవే గతిగాద శ్రీ ॥రఘు॥ |
| చరణము(లు): |
| భవ సాగరము దాట లేక నే బలు గాసి బడి నీ మఱుఁగు జేరితిని అవనిజాధిపా శ్రితరక్షక ఆనందకర శ్రీ త్యాగరాజనుత ॥రఘు॥ |